భారత్‌లో బుల్లెట్ ట్రెయిన్... అహ్మదాబాద్-ముంబై... రూ. 88 వేల కోట్ల వ్యయం
భారతదేశంలో త్వరలో బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 88 వేల కోట్ల వ్యయంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 508 కిలో మీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ ట్రెయిన్ కేవలం 2 నుంచి 3 గంటల్లోనే చేరుకుంటుంది. మామూలుగా అయితే ఎక్స
భారతదేశంలో త్వరలో బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 88 వేల కోట్ల వ్యయంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 508 కిలో మీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ ట్రెయిన్ కేవలం 2 నుంచి 3 గంటల్లోనే చేరుకుంటుంది. మామూలుగా అయితే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ వ్యవధి 8 గంటల పాటు సాగుతుంది. ఐతే ఈ బుల్లెట్ రైలుతో ప్రయాణ కాలం సుమారు 5 గంటలకు పైగా ఆదా అవుతుంది. ఈ రైలు మార్గాన్ని భూమికి 20 మీటర్ల పైన పిల్లర్లతో నిర్మించనున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు జపాన్ ప్రధాని శంకుస్థాపన చేసేందుకు బుధవారం భారతదేశానికి వచ్చారు.
ప్రోటోకాల్ పక్కన పెట్టి జపాన్ ప్రధానికి స్వాగతం చెప్పేందుకు ప్రధానమంత్రి మోదీ విమానాశ్రయానికి వెళ్లారు. జపాన్ ప్రధాని షింజో అబె భారత ప్రధాని మోదీతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్ రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం జపాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ... భారతదేశంతో తమ దేశానికి మధ్య ఉన్న బంధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదని అన్నారు. భారతదేశంతో వ్యాపార సంబంధాలను మరింత పెంచుకునేందుకు జపాన్ దేశం ఆసక్తిగా వున్నట్లు వెల్లడించారు. తమకున్న సాంకేతిక శక్తితో భారతదేశంలోని మానవ వనరులతో కలిపి భవిష్యత్తులో తిరుగులేని విజయాలను సాధిస్తామని వెల్లడించారు.