శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (09:36 IST)

భార్యకు అధికారం.. భర్తకు అనారోగ్యం.. ఎవరు.. ఏమిటి... ఎక్కడ?

భార్యకు అధికారం.. భర్తకు అనారోగ్యం.. ఎవరు.. ఏమిటనే కదా మీ సందేహం. ఆ భార్య ఎవరో కాదు.. శశికళ. భర్త.. నటరాజన్. శశికళకు ముఖ్యమంత్రి పీఠం రాగానే, ఆమె భర్త నటరాజన్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చెన

భార్యకు అధికారం.. భర్తకు అనారోగ్యం.. ఎవరు.. ఏమిటనే కదా మీ సందేహం. ఆ భార్య ఎవరో కాదు.. శశికళ. భర్త.. నటరాజన్. శశికళకు ముఖ్యమంత్రి పీఠం రాగానే, ఆమె భర్త నటరాజన్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
తమిళనాడు అసెంబ్లీ శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. దీంతో ఆమె తమిళనాట చక్రం తిప్పేశానంటూ విక్టరీ సింబల్ చూపిస్తుంచారు. ఇంతలోనే ఆమెకు ఓ షాకింగ్ న్యూస్. భర్త నటరాజన్‌కు అనారోగ్యం అంటూ మీడియాలో కనబడ్డ బ్రేకింగ్ న్యూస్.. శశికళ ప్రమోషన్ సంబరంపై నీళ్లు జల్లేసింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో నటరాజన్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. 
 
ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇటు.. సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం చూసుకుంటున్న శశికళ ఆస్పత్రి పడక మీదున్న భర్తను పరామర్శించే తీరిక కూడా లేకపోయింది. 7 లేదా 9 తేదీల్లో శశికళ ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి.