గురువారం, 24 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 19 మే 2016 (14:16 IST)

అండర్‌గ్రౌండ్ నుంచి బయటకొచ్చిన 'అమ్మ'... నా జీవితం తమిళ ప్రజలకే అంకితం... జయలలిత

ఎన్నికలు జరిగాక ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నాడీఎంకెకు వ్యతిరేకంగా రావడంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయింది జయలలిత. ఫలితాలు పూర్తిగా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న దిశగా వచ్చిన తర్వాత అంతా నిర్ధారించుకుని బయటకు వచ్చింది జయలలిత. కొద్దిసేపటి క్రితం మ

ఎన్నికలు జరిగాక ఎగ్జిట్ పోల్ ఫలితాలు అన్నాడీఎంకెకు వ్యతిరేకంగా రావడంతో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయింది జయలలిత. ఫలితాలు పూర్తిగా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న దిశగా వచ్చిన తర్వాత అంతా నిర్ధారించుకుని బయటకు వచ్చింది జయలలిత. కొద్దిసేపటి క్రితం మీడియాతో ఆమె మాట్లాడింది. ప్రజల కోసమే నేను.. అనేది తన తారకమంత్రం అనీ, అందువల్లనే ప్రజలు తనపై విశ్వాసం ఉంచి తిరిగి గెలిపించారని ఆమె చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 1984 తర్వాత వరుసగా రెండోసారి ఒకే పార్టీని గెలిపించిన ఘనత ఈ 2016లో జరిగిందన్నారు. తనపై నమ్మకం ఉంచి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఇచ్చినందుకు తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ నెరవేరుస్తానని స్పష్టం చేశారు. తన జీవితం తమిళ ప్రజలకే అంకితమనీ, తన చివరి శ్వాస వరకూ తమిళ ప్రజల కోసమో పని చేస్తానని పురిట్చితలైవి జయలలిత అన్నారు.