మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2024 (14:01 IST)

అమెరికాకు ఎయిరిండియా విమానాలు రద్దు.. ఎందుకో తెలుసా?

air india flight
భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమెరికాకు నడుపుతున్న విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు సుమారుగా 60 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిరిండియా ప్రకటించింది. నిర్వహణ, ఎయిర్ క్రాఫ్ట్‌ సమస్యల కారణంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అదేసమయంలో రద్దు చేసిన విమాన సర్వీసుల స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. 
 
విమాన ప్రయాణికులతో పాటు కస్టమర్లకు అందించిన సమాచారం మేరకు ఎయిరిండియా సంస్థ ద్వారా నడుపుతున్న ఇతర విమనాల్లో తర్వాతి రోజులకు సర్వీసుని ఆఫ్ చేసినట్టు సంస్థ తెలిపింది. ఢిల్లీ - చికాగో మార్గంలో 14 విమానాలు, ఢిల్లీ - వాషింగ్టన్ మార్గంలో 28, ఢిల్లీ - ఎస్ఎఫ్‌వో మధ్య 12 విమాన సర్వీలు, ముంబై - న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలతో పాటు ఢిల్లీ - నెవార్క్ మార్గంలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ఎయిరిండియా తెలిపింది. అదేసమయంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినట్టు పేర్కొంది.