గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 అక్టోబరు 2024 (21:59 IST)

ఇక భారత్‌లోనే ఐఫోన్ 17 తయారీ

apple iPhone
వచ్చే ఏడాది విడుదల కానున్న ఐఫోన్ 17 తయారీ ప్రక్రియపై ఆపిల్ పని చేయడం ప్రారంభించింది. ఐఫోన్ 17 బేస్ మోడల్‌ను భారతదేశంలో తయారు చేయనున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఐఫోన్ 17 బేస్ మోడల్ కోసం ముందస్తు తయారీ పనిని చేయడానికి ఆపిల్ మొదటిసారిగా భారతీయ ఫ్యాక్టరీని ఉపయోగిస్తుంది.
 
చైనా నుండి భారతదేశానికి యాపిల్ ఫోన్స్ విక్రయం ఊపందుకుంది. ఇందులో భాగంగా యాపిల్ సెప్టెంబరు 2024 వరకు ఆరు నెలల్లో భారతదేశంలో తయారు చేసిన 6 బిలియన్ల ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. అయితే, చాలా ఎదురుచూస్తున్న iPhone 17 ఎయిర్ లేదా Slim, Pro మోడల్‌లు - iPhone 17 Pro, iPhone Pro Max చైనాలో తయారు చేయబడతాయి. 
 
బేస్ మోడల్ మాత్రమే భారతదేశంలో తయారు చేయబడుతుంది. అయితే ఇక యాపిల్ భారతదేశంలో తన తయారీని విస్తరించింది. 
 
గతంలో 2017లో భారతదేశంలో ఐఫోన్‌ల తయారీని ప్రారంభించింది. దేశంలో తయారు చేయబడిన ఏకైక పరికరంగా iPhone ఎస్సీతో ప్రారంభించబడింది. ప్రస్తుతం దేశంలో iPhone 16కు చెందిన నాలుగు మోడల్‌లు భారతదేశంలోనే తయారు చేయడం జరిగింది.