1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (16:25 IST)

వికాస్ రథ యాత్రకు బ్రేక్.. మెర్సిడెస్ బస్సు మధ్యలో ఆగిపోయింది.. అఖిలేష్‌కు కొత్త చిక్కు..

వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడ

వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా మెర్సిడెస్ బస్సును సిద్ధం చేసుకున్నారు. 
 
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా భావించిన అఖిలేశ్ గురువారం వికాస్ ర‌థ‌యాత్రను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఎంతో మంది కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల మ‌ధ్య ప్రారంభ‌మ‌యిన ర‌థ‌యాత్ర కొద్ది సేప‌టికే ఆగిపోయింది. ఎన్నో హైటెక్ హంగుల‌తో త‌యారు చేసిన‌ ర‌థ‌యాత్ర వాహ‌నంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో మార్గమధ్యంలోనే ఆగిపోయింది. 
 
వాహ‌నంలో అఖిలేష్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప‌ర్య‌టించాల్సిన నేపథ్యంలో కిలోమీట‌రు ప్ర‌యాణించ‌గానే వాహ‌నంలో ఈ స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో తాత్కాలికంగా వికాస్ రథ‌యాత్ర‌ను నిలిపివేస్తున్న‌ట్లు అఖిలేశ్ వెల్లడించారు.