శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 మే 2022 (09:38 IST)

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం : నేతల శుభాకాంక్షలు

May Day
ఈ దేశాన్ని కొన్ని దశాబ్దాలుగా కార్మికులు ముందుకు నడిపిస్తున్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రతి యేటా మే ఒకటో తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. అనేక దేశాల్లో మే ఒకటో తేదీని నిర్బంధ సెలవు దినోత్సవంగా ప్రకటించి, అమలు చేస్తున్నారు. ఈ మే డే రోజున ప్రభుత్వాల తరపున కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 
 
ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డేను పురస్కరించుకుని దేశాధినేతల నుంచి అన్ని రాజకీయ పార్టీ నేతలు కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఇదే అంశంపై తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. 
 
ప్రధానంగా ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకొంటూ విజయవంతంగా అమలవుతున్నదని చెప్పుకొచ్చారు. 
 
వినూత్న పారిశ్రామిక విధానాల ద్వారా తెలంగాణలో సంపద సృష్టి జరుగుతున్నదని, అది దేశాభివృద్ధికి దోహదపడుతున్నదని వెల్లడించారు. నిరుద్యోగులు, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు.