శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 16 జనవరి 2017 (05:44 IST)

మా మనోభావాలతో ఆడుకోవద్దు: అమెజాన్‌కు భారత్ హెచ్చరిక

భారతీయ చిహ్నాలు, మహనీయుల చిత్రాలతో పరాచకాలు చేయవద్దని కేంద్ర ఆర్ధిక వ్యవహారాల శాఖ అంతర్జాతీయ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ని తీవ్రంగా హెచ్చరించింది. భారత మనోభావాల పట్ల వివక్ష చూపిస్తే చేతులారా అమెజాన్ పతనాన్ని కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించింది.

భారతీయ చిహ్నాలు, మహనీయుల చిత్రాలతో పరాచకాలు చేయవద్దని కేంద్ర ఆర్ధిక వ్యవహారాల శాఖ అంతర్జాతీయ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ని తీవ్రంగా హెచ్చరించింది. భారత మనోభావాల పట్ల వివక్ష చూపిస్తే చేతులారా అమెజాన్ పతనాన్ని కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరించింది. భారత జాతీయ జెండాను పోలిన బొమ్మను కాళ్లు తుడుచుకునే డోర్ మ్యాట్‌పై ముద్రించి అమెజాన్ కెనడా విభాగం ఆ దేశంలో అమ్మకానికి పెట్టిన ఉదంతం తీవ్ర సంచలనం రేకెత్తించిన నేపథ్యంలో అమెజాన్ భారత వ్యతిరేక వైఖరికి సంబంధించిన పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. డోర్ మ్యాట్ల అమ్మకాల విషయంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హెచ్చరికతో లెంపలేసుకుని ఆ డోర్ మ్యాట్ల అమ్మకాలను వెబ్ సైట్ నుంచి తొలగించిన అమెజాన్ తాజాగా మరో వివాదంలో కూరుకుపోయింది. 
 
తన అమెరికన్ వెబ్‌సైట్‌లో భారత జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాన్ని ఆగౌరవపర్చేలా రూపొందించి అమెజాన్ సంస్థ అమ్మకానికి పెట్టిన వైనం తాజాగా బహిర్గతం కావడంతో భారత విదేశీ మంత్రిత్వ శాఖ వాషింగ్టన్ లోని భారతీయ రాయబారిని సంప్రదించి తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించింది. కంపెనీ చెబుతున్నట్లుగా మూడో పార్టీ విక్రేతలకు తన వెబ్ సైటులో అవకాశమిస్తున్నప్పుడు వారు భారతీయ మనోభావాలను గౌరవించాలని కోరింది.
 
అయితే అమెజాన్ భారత్‌ను దెబ్బతీసే ఉత్పత్తులను అమ్మకానికి పెట్టడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది కూడా అమెజాన్ సంస్థ భారతీయ దేవతల చిత్రాలతో కూడిన డోర్ మ్యాట్లను అమ్మకానికి పెట్టి భారతీయుల ఆగ్రహాన్ని చవిచూసింది. అమెజాన్‌ సంస్థను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో భారతపౌరులు సందేశాలు వెల్లువెత్తించడంతో అప్పటికి అమెజాన్ తాత్కాలికంగా దిగివచ్చింది. కానీ తన రోగాన్ని  నయం చేసుకోలేదని తెలుస్తోంది.