శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (13:36 IST)

13 బాలికపై ఆటో డ్రైవర్ స్నేహితుల కన్ను.. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి..?

13 చిన్నారిపై రోజూ పాఠశాలకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తమిళనాడు, వేలూరు జిల్లా, ఆంబూరుకు సమీపంలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోజూ ఆటోలో స్కూలుకు తీసుకెళ్లే 13 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానని మోసగించి లైంగిక దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఆంబూరుకు సమీపంలో రెండేళ్ల పాటు ఓ బాలికను పాఠశాలకు ఆటోలో పంపుతున్నారు. వారి తల్లిదండ్రులు. అక్బాన్ అనే పేరున్న ఆటో డ్రైవర్ బాలికను తీసుకెళ్లేవాడు. అయితే అక్బానుకు స్నేహితులైన ఇర్ఫాన్ ఖాన్, ముదాసీర్‌లు బాలికను కిడ్నాప్ చేసి.. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి.. బలవంతంగా బెంగళూరుకు తీసుకెళ్లారు. 
 
ఈ నేపథ్యంలో ఆంబూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాలిక కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిపిన విచారణలో ఆటో డ్రైవర్, అతడి స్నేహితుల గుంపును పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో సంబంధం వున్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.