బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 6 డిశెంబరు 2016 (19:25 IST)

చెన్నై మెరీనా తీరంలో జయలలిత అంత్యక్రియలు పూర్తి.... శశికళ అంతిమ సంస్కారాలు...

అశేష జనవాహిన అశ్రు నయనాల మధ్య 'అమ్మ' జయలలిత అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. త్రివిధ దళాల సైనికాధికారుల లాంఛనాలతో జయ అంత్యక్రియలు నిర్వహించారు. జయలలిత మిత్రురాలు శశికళ జయకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

తమిళనాడు మాజీముఖ్యమంత్రి ఎంజీఆర్ సమాధికి సమీపాన ఆమెను ఖననం చేశారు. అంత్యక్రియల క్రతువులో తమిళనాడు ఇంచార్జి గవర్నరు విద్యాసాగర్ రావు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఇంకా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.