1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 14 జులై 2020 (20:56 IST)

వివాహితుడితో ఇంటర్ విద్యార్థిని ఎంజాయ్, ఆ తరువాత?

అతనికి పెళ్ళయి ఇద్దరు పిల్లలు. ఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా సాగిపోతున్న జీవితం. అయితే లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉండటం.. ఇంటి పక్కనే ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థి వివాహితుడిపై మోజు పెంచుకోవడం.. ఆమే ఒత్తిడి చేయడంతో శారీరకంగా కలవడం.. చివరకు పెద్దలకు తెలిసింది. దీనితో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
 
బీహార్ లోని నలంద జిల్లాకు చెందిన స్థానికంగా 12వ తరగతి చదువుతున్న రేష్మి రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. రేష్మి ఆత్మహత్యపై పోలీసులు విచారణ ప్రారంభించారు. తన ఇంటి పక్కన ఒక వివాహితుడిని ప్రేమించడమే కాదు మూడు నెలల పాటు లాక్ డౌన్ కాలంలో అతనితో శారీరకంగా కలిసింది.
 
యువతి ఇంట్లో తెలిసి, ఆమెను వారు మందలించారు. అయితే యువతిలో మార్పు రాలేదు. ఇంట్లో యువతికి వేరే పెళ్ళి చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆ యువతి వివాహితుడి ఇంటికి వచ్చేసింది. తనకిప్పటికే పెళ్ళయిందని పెళ్ళి చేసుకోవడం కుదరదని అతను చెప్పాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైంది యువతి. తన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.