ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 20 జనవరి 2017 (20:50 IST)

శభాష్ తమిళనాడు... ఐకమత్యంతో సాధించారు... జల్లికట్టు ఆర్డినెన్స్ రాష్ట్రపతికి...

అదీ ఐకమత్యమంటే... ఎద్దు బొమ్మలను వేసుకుని గత నాలుగు రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు కోసం తమిళ ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనలు చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా కలిసి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని ఆందోళన బాట పట్టారు. దీనితో ప్రభుత్వాలు కది

అదీ ఐకమత్యమంటే... ఎద్దు బొమ్మలను వేసుకుని గత నాలుగు రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు కోసం తమిళ ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనలు చేశారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా కలిసి జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని ఆందోళన బాట పట్టారు. దీనితో ప్రభుత్వాలు కదిలిపోయాయి. ఫలితంగా శుక్రవారం సాయంత్రం తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 
 
జల్లికట్టు క్రీడను అనుమతిస్తూ, తమిళుల డిమాండ్ల మేరకు తమిళనాడు ప్రభుత్వం పంపిన ఆర్డినెన్సును న్యాయశాఖకు పంపడం, అక్కడ దానికి కొద్దిపాటు మార్పులు చేసి న్యాయ శాఖ ఆమోదించడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ఆమోదం కోసం రాష్ట్రపతి ప్రణబ్ వద్దకు పంపింది. మరికొన్ని గంటల్లో దీనికి ఆమోద ముద్ర పడబోతోంది. రాష్ట్రపతి ఆమోదించడమే తరువాయి.