శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (17:31 IST)

ముంబై నర్స్ ప్రీతి రతిపై యాసిడ్ దాడి కేసు : ముద్దాయికి ఉరిశిక్ష

ముంబై నర్స్ ప్రీతి రతిపై యాసిడ్ దాడికి పాల్పడిన ముద్దాయి అంకుర్ పన్వర్‌కు ఉరిశిక్ష విధిస్తూ ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ప్రీతి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందనే అసూయతో ముద్ద

ముంబై నర్స్ ప్రీతి రతిపై యాసిడ్ దాడికి పాల్పడిన ముద్దాయి అంకుర్ పన్వర్‌కు ఉరిశిక్ష విధిస్తూ ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. ప్రీతి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందనే అసూయతో ముద్దాయి అంకుర్ యాసిడ్ పోసి, హత్య చేశాడని కోర్టు నిర్ధారించింది. దోషికి గురువారం కోర్టు శిక్షను ఖరారు చేసింది.
 
న‌ర్స్ ప్రీతి రతిపై యాసిడ్ దాడి చేసి ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన అంకుర్ ప‌న్వ‌ర్‌కు ఉరిశిక్ష విధిస్తున్నట్టు ముంబైలోని ప్ర‌త్యేక కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు వెలువ‌డ‌గానే అక్క‌డే ఉన్న ప్రీతి సోద‌రుడు హితేష్.. అంకుర్ ప‌న్వ‌ర్‌పై దాడి చేశాడు. ఏమాత్రం ద‌యాదాక్షిణ్యాలు లేకుండా అంకుర్ ఈ దాడి చేశాడ‌ని, అందువ‌ల్ల అత‌నికి పెద్ద శిక్ష విధించాల‌ని ప్రాసిక్యూష‌న్ వాదించింది. వారి వాద‌న‌కు అనుకూలంగానే ప్ర‌త్యేక కోర్టు అంకుర్‌కు ఉరిశిక్ష విధించింది.
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... గత 2013లో ప్రీతికి ముంబైలోని కొలబా నావల్ హాస్పిటల్లో (ఐఎన్ఎస్ అశ్విని) స్టాఫ్‌ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ప్రీతి ఉద్యోగంలో చేరేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి మే 2న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుంచి ముంబై వచ్చింది. అదే రైలులో ఆమెకు తెలియకుండా అంకుర్ దొంగచాటుగా (టికెట్ లేకుండా) ముంబై వచ్చాడు. బాంద్రా టర్మినెస్లో ప్రీతి దిగిన వెంటనే అంకుర్ ఆమెపై యాసిడ్ దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటనలో ప్రీతి ఊపరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 1న మరణించింది.
 
దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో ప్రీతిని పెళ్లిచేసుకోవాలని అతను ఆశపడగా, ఆమె తన కెరీర్ దృష్ట్యా నిరాకరించింది. ప్రీతి ముంబైకు వెళ్లకుండా ఆపేందుకు అంకుర్ ప్రయత్నించగా, అతని అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆమె ముంబైకి బయల్దేరింది. దీంతో ఆమెపై యాసిడ్‌ దాడి చేసినట్టు వెల్లడైంది. ఈ కేసులో ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని ముద్దాయిగా తేల్చింది.