గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (17:17 IST)

యాపిల్స్‌పై భారత్ వ్యతిరేక స్లోగన్లు.. మాకు స్వాతంత్ర్యం కావాలి.. కుక్కలు వెనక్కి వెళ్ళిపోవాలి..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ విమర్శలు గుప్పిస్తుంటే.. కాశ్మీర్‌ యాపిల్స్‌పై భారత వ్యతిరేక స్లోగన్లు కనిపించాయి. హ

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ విమర్శలు గుప్పిస్తుంటే.. కాశ్మీర్‌ యాపిల్స్‌పై భారత వ్యతిరేక స్లోగన్లు కనిపించాయి. హర్యానాకు దిగుమతి అయిన కాశ్మీరీ యాపిల్స్‌పై భారత్ వ్యతిరేక నినాదాలు కనిపించడం సంచలనమైంది.

సిర్సా కూరగాయల మార్కెట్‌కు వచ్చిన రెండు బాక్సుల కాశ్మీర్‌ యాపిల్స్‌ను తెరిచి చూడగా, వాటిలోని రెండు యాపిల్స్‌పై భారత వ్యతిరేక నినాదాలు కనిపించాయి. 'మాకు స్వాంతంత్ర్యం కావాలి', 'కుక్కలు వెనక్కి వెళ్లిపోవాలి' అనే నినాదాలు ఈ యాపిల్స్‌పై రాసి ఉన్నాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇంకా ఆ బాక్సులోని ఓ యాపిల్‌పై తాము కాశ్మీర్, పుల్వామాకు చెందిన స్వాతంత్ర్య యోధులం అనే స్లోగన్ కూడా ఉంది. ఈ పండ్ల పెట్టెను కొన్న హరీష్ కుమారుడు పరాగ్ మీడియాతో మాట్లాడుతూ.. యాపిల్స్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు ఉన్నట్టు చెప్పాడు. కశ్మీర్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న భారత సైన్యాన్ని కాశ్మీరీలు ఎలా విస్మరించగలరని ప్రశ్నించాడు.