శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2016 (15:43 IST)

'కాఫీ పీనా హై ఆజ్' ఇదీ భారత్‌లో పాక్ గూఢచారుల కోడ్ లాంగ్వేజ్

ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పని చేసే దౌత్యాధికారి గూఢచర్య కేసులో దేశ బహిష్కరణకు గురయ్యాడు. భారత్‌కు చెందిన రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో

ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పని చేసే దౌత్యాధికారి గూఢచర్య కేసులో దేశ బహిష్కరణకు గురయ్యాడు. భారత్‌కు చెందిన రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అతన్ని ఢిల్లీ నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. 
 
అయితే, ఈ గూఢచర్యం జరిపిన వారంతా ప్రత్యేక కోడ్ భాషను వాడుతూ వచ్చారు. 'కాఫీ పీనా హై ఆజ్' (ఇవాళ కాఫీ తాగాలి) అంటే... నేడు మనం సమావేశం కావాలి అని. పిజ్జా తిందామనో బర్గర్ ఉందనో అంటే ఏదో సమాచారం ఇచ్చి పుచ్చుకోవాల్సి ఉందని అర్థం. గ
 
వీరు జనసమ్మర్ధం అధికంగా ఉండే అన్సాల్ ప్లాజా, పీతంపురా మాల్, ప్రీతి విహార్ మాల్ వంటి చోట్ల కలుసుకుని సాంకేతిక సమాచారాన్ని, డాక్యుమెంట్లనూ ఇచ్చి పుచ్చుకునే వారని విచారణ అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లోనే డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారని, అందరి ముందైతే ఎవరికీ అనుమానం రాదన్నదే వారి ఆలోచనని తెలిపారు.