ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మే 2024 (15:00 IST)

అరవింద్ కేజ్రీవాల‌్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ లిక్కర్ స్కామ్‌లో ఈ నెల 21వ తేదీన ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం అనుకూలంగా తీర్పునిచ్చింది. 
 
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ ఒకటో తేదీ వరకు ఈ బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2వ తేదీన లొంగిపోవాల్సి ఉంటుందని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21వ తేదీన అరెస్టు చేసిన విషయం తెల్సిందే. కోర్టు కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కస్టడీ పొడగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.