బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (11:33 IST)

దగ్గుకు ఆపరేషన్ చేయించుకోనున్న అరవింద్ కేజ్రీవాల్‌.. బెంగుళూరులో విశ్రాంతి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. గత కొంతకాలంగా ఈయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అన్నిరకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్న కూడా దగ్గు మాత్రం తగ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. గత కొంతకాలంగా ఈయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అన్నిరకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్న కూడా దగ్గు మాత్రం తగ్గకపోవడంతో అందుకోసం ఈనెల 13న బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో సీఎం ఆపరేషన్ చేయించుకోనున్నారు. ఆపరేషన్ అనంతరం 10 రోజుల పాటు బెంగళూరులోనే విశ్రాంతి తీసుకోనున్నారు. 
 
కేజ్రీవాల్‌ ఈనెల 8 నుంచి నాలుగు రోజుల పాటు పంజాబ్‌లో పర్యటించి కార్యకర్తలతో సమావేశంకానున్నారు. సర్జరీ అనంతరం సెప్టెంబర్ 22న కేజ్రీవాల్ ఢిల్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు అంటున్నారు. సర్జరీ సమయంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న గోవా ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేయనుండటంతో సిసోడియా ఈ నెల 7న గోవా వెళ్లే అవకాశాలు ఉన్నయని సమాచారం.