మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (19:21 IST)

భారత్ చేతికి జీ-20 అధ్యక్ష బాధ్యతలు.. అరుదైన గౌరవం

G-20 India
G-20 India
జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేతికి వచ్చాయి. ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్‌కు బదిలీ చేయడం జరిగింది. తద్వారా భారత్‌కు మరో ఘనత దక్కినట్లైంది. ఫలితంగా డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుంది. 
 
ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ మాట్లాడుతూ... భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నామని.. తీవ్రవాదం, నల్లధనం కట్టడిపై భారత్ స్పష్టతతో వుందని చెప్పుకొచ్చారు. 
 
ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సవాళ్లను పరిష్కరించేందుకు జీ-20  సాయపడుతుందని తెలిపారు. 2023 సెప్టెంబర్‌లో జరిగే జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.