శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (19:09 IST)

పాక్ గడ్డపై సెంచరీల మోత.. ఇంగ్లండ్ భారీ స్కోర్

England
పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీమ్.. రావల్పిండి  వేదికగా డిసెంబర్ 1 మొదలైన తొలి టెస్టులో పరుగులతో పరుగుల వరద పారిస్తుంది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాక్ గడ్డపై ఇంగ్లండ్ అదరగొడుతోంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌ భారీ స్కోర్‌ దిశగా పయనిస్తుంది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలే అదరగొట్టారు. 106 బంతుల్లో 14 ఫోర్లతో 101 పరుగులు సాధించాడు. అలాగే క్రాలే 21 ఫోర్లతో 106 బంతుల్లో 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 
 
సెంచరీలతో చెలరేగిన వీరిద్దరూ.. పాక్ బౌలర్లను చుక్కలు చూపిస్తున్నారు. ఇక ఆఖరన స్టోక్స్ కూడా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి జట్టు స్కోర్‌ను 500 పరుగులు దాటించాడు.
 
ఐదుగురు బౌలర్లలో, ఎవరూ ఇంగ్లిష్ ఓపెనర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. దీంతో రావల్పిండి టెస్ట్ ప్రారంభ రోజున కేవలం 75 ఓవర్లలో 506/4 స్కోర్ చేశారు.