శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 నవంబరు 2022 (13:59 IST)

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ ఫైనల్ : పాక్ బ్యాటింగ్.. ఇంగ్లండ్ ఫీల్డింగ్

icc mens world cup
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, ఆదివారం ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభమైంది. ఇందులో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఆస్ట్రేలియాలోని ఎంసీజీ స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లూ సర్వశక్తులు ఒడ్డి పోరాడనున్నాయి. 
 
ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ ఎలాంటి మార్పులు చేయలేదు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో ఆడిన జట్లనే బరిలోకి దించాయి. ఇదిలావుంటే, తొలుత బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్ జట్టు భారీ స్కోరు చేస్తేగానీ విజేతగా నిలిచే అవకాశం లేదు. మరోవైపు, ఈ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. కానీ, అందుకు విరుద్ధంగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.