శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (20:30 IST)

ఇంగ్లండ్ క్రికెటర్లకు సోకిన గుర్తు తెలియని వైరస్..

captain Stokes
captain Stokes
ఇంగ్లండ్ క్రికెట్ సంక్షోభంలో పడింది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు జట్టులోని 14మంది సభ్యులకు తెలియని వైరస్ సోకింది. వివరాల్లోకి వెళితే.. రావల్సిండిలో జరుగనున్న టెస్టు మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఈ వైరస్ సోకినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. 
 
డిసెంబర్ 1 నుంచి పాకిస్థాన్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ జరుగనుంది. ఇందుకోసం ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటిస్తోంది. తాజాగా ఇంగ్లండ్ ఆటగాళ్లకు వైరస్ సోకడంతో హోటల్‌లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏ వైరస్ బారిన పడ్డారనేది ఇంకా నిర్ధారణ కాలేదు.