ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 3 అక్టోబరు 2016 (13:45 IST)

పాక్ ప్రజల పిచ్చి చేష్టలు... వాఘా సరిహద్దులో భారత్ పైన రాళ్ల దాడి... యుద్ధం కావాలా...?

పాకిస్తాన్ సైన్యమే అనుకుంటే పాకిస్తాన్ దేశంలో కొంతమంది ప్రజలు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దులో జాతీయ పతాకాలను ఎగురవేసేటపుడు, దించే సమయాల్లో ఇరు దేశాలకు సంబంధించి రిట్రీట్ జరిగుతుందన్నది తెలిసిన విషయమే. ఐతే ఈ కార్యక్రమం చూసేందుకు ఇటు

పాకిస్తాన్ సైన్యమే అనుకుంటే పాకిస్తాన్ దేశంలో కొంతమంది ప్రజలు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. భారత్-పాక్ సరిహద్దులో జాతీయ పతాకాలను ఎగురవేసేటపుడు, దించే సమయాల్లో ఇరు దేశాలకు సంబంధించి రిట్రీట్ జరిగుతుందన్నది తెలిసిన విషయమే. ఐతే ఈ కార్యక్రమం చూసేందుకు ఇటు భారత్, అటు పాకిస్తాన్ దేశాల నుంచి ప్రజలు హాజరవుతుంటారు. 
 
అలా హాజరయిన పాకిస్తాన్ ప్రజల్లో కొందరు భారత్ వైపుకు రాళ్ల దాడి చేసి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సైనికుల మధ్య జరిగే పరేడ్ ను ఆసక్తిగా తిలకించడం ఎప్పటినుంచో జరుగుతున్న విషయమే. ఐతే హఠాత్తుగా పాక్ వైపు నుంచి రాళ్ల దాడి జరపడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. 
 
కాగా ఈ సంఘటనలో ఎంతమందికి గాయాలయ్యాయో తెలియరాలేదు. ఈ సమాచారం బయటకు వస్తే పరిస్థితి మరింతి ఉద్రక్తంగా మారే అవకాశం ఉంది. కాగా కొందరు ఛాందసవాదులు రెచ్చగొట్టే ధోరణితో భారతదేశాన్ని కవ్వించడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా భారతదేశాన్ని యుద్ధం వైపు పురిగొల్పడమే పనిగా వారి చేష్టలు ఉంటున్నాయి.