ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (11:48 IST)

డేరా బాబా భార్యను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు..

డేరా సచ్ఛా సౌదా మాజీ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను రోహ్‌తక్ జైలులో చూసేందుకు ఆయన సతీమణి హర్జీత్ కౌర్ వెళ్లారు. అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న డేరా బాబా కన్నీళ్లు పెట్టుకున్నాడు

డేరా సచ్ఛా సౌదా మాజీ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను రోహ్‌తక్ జైలులో చూసేందుకు ఆయన సతీమణి హర్జీత్ కౌర్ వెళ్లారు. అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్ష అనుభవిస్తున్న డేరా బాబా కన్నీళ్లు పెట్టుకున్నాడు. గుర్మీత్‌ రాం రహీం సింగ్‌‌ను చూసేందుకు ఆయన భార్య హర్జీత్‌ కౌర్‌, కుమారుడు చరణ్ ప్రీత్, కుమార్తె జస్మీత్ సింగ్, అల్లుడు అమర్ ప్రీత్ వెళ్లారు. 
 
దీపావళిని పురస్కరించుకుని ఆయన్ని జైలులో కలిశారు. స్వీట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా డేరా బాబా ఉద్వేగానికి లోనైనారు. దీంతో ఆయను ఓదార్చిన కుటుంబ సభ్యులు, స్వీట్లు, చలికాలంలో వేసుకునేందుకు దుస్తులు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా.. జైలుకు వచ్చిన తొలినాళ్లలో ఇబ్బందులు పడినా ప్రస్తుతం రోజువారీ పనులకు గుర్మీత్ అలవాటు పడినట్టు చెప్తున్నారు. కూరగాయల సేద్యం పని అప్పగించి రోజుకు రూ.20 వేతనం ఇస్తున్నారన్నారు.