మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2017 (13:47 IST)

రేప్ చేయబోతే ప్రతిఘటించిందనీ చెవులు కత్తిరించేసిన కిరాతకులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ, బాలిక ఆ నలుగురు మృగాళ్లను ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన కిరాతకులు.. ఆ బాలిక చ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ బాలికపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కానీ, బాలిక ఆ నలుగురు మృగాళ్లను ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి లోనైన కిరాతకులు.. ఆ బాలిక చెవులు కత్తిరించేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యూపీలోని బాగ్‌పత్‌లో ఓ బాలిక తమ ఇంట్లో ఒంటరిగా నివశిస్తోంది. నలుగురు వ్యక్తులు బుధవారం రాత్రి అమ్మాయి ఇంటిలోకి చొరబడి  అత్యాచారానికి ప్రయత్నించారు. దీన్ని ఆ బాలిక ప్రతిఘటించింది. దీంతో ఆ కామాంధులు కిరాతకంగా చెవులు కోసేశారు. 
 
దీనిపై బాగ్‌పత్‌ బీజేపీ ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ స్పందించారు. 'ఈ విషయం గురించి నేను ఎస్పీతో మాట్లాడాను. డిసెంబరు 31న ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు. ఇరుగు పొరుగు ఇళ్లవారి మధ్య గొడవ అది. ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేశారంటే అర్థం చేసుకోవచ్చు అందులో నిజమెంతో..' అని ఎంపీ అన్నారు.