గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 15 జూన్ 2017 (16:11 IST)

ఛీ... ఛీ... ఇక్కడ కామసూత్ర పుస్తకాల అమ్మకమా? నిషేధించండి...

ఖజురహో అనగానే కామసూత్ర బొమ్మలు గుర్తుకువస్తాయి. ఐతే రకరకాల శృంగార భంగిమల్లో ఖజురహో దేవాలయంపై వున్న బొమ్మలను తీసుకుని పుస్తకాలను అచ్చువేసి అమ్మడాన్ని భజరంగ్ సేన కార్యకర్తలు తప్పుబడుతున్నారు. ఈ బొమ్మలున్న పుస్తకాలను విదేశీయులకు అమ్మడం వల్ల మనదేశంపై చుల

ఖజురహో అనగానే కామసూత్ర బొమ్మలు గుర్తుకువస్తాయి. ఐతే రకరకాల శృంగార భంగిమల్లో ఖజురహో దేవాలయంపై వున్న బొమ్మలను తీసుకుని పుస్తకాలను అచ్చువేసి అమ్మడాన్ని భజరంగ్ సేన కార్యకర్తలు తప్పుబడుతున్నారు. ఈ బొమ్మలున్న పుస్తకాలను విదేశీయులకు అమ్మడం వల్ల మనదేశంపై చులకన భావం ఏర్పడదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
 
కనుక ఖజూరహో దేవాలయంలో కామసూత్ర పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలంటూ ‘భజరంగ్ సేన’ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఛతర్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఖజురహో ఆలయాల్లోని పశ్చిమ దేవాలయ సముదాయాల్లో కామసూత్ర పుస్తకాలు, అశ్లీల చిత్రాలు అమ్ముతున్నారనీ, వీటివల్ల భారత సంస్కృతికి అపఖ్యాతి వస్తోందని వాదిస్తున్నారు. మరి వీరి వాదనపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకుంటారో వేచిచూడాలి.