శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2017 (10:58 IST)

స్నేహితుడితో కలిసి పక్క పంచుకోమన్నాడు.. కుదరదనేసరికి భార్యపై, ఫ్రెండ్‌తో కలిసి?

కట్టుకున్న భార్యపై స్నేహితుడితో కలిసి అత్యాచారయత్నం చేసిన ప్రబుద్ధిడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో సాదహళ్లి గేట్ వద్ద తన భార్యతో

కట్టుకున్న భార్యపై స్నేహితుడితో కలిసి అత్యాచారయత్నం చేసిన ప్రబుద్ధిడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో సాదహళ్లి గేట్ వద్ద తన భార్యతో కలిసి నివాసం ఉండేవాడు. ఆ దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ మధ్యే ఆ వ్యక్తి తన భార్యకు తెలియకుండా మరోక మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. 
 
అయితే మొదటి భార్య వద్దకు స్నేహితుడు రవిని తీసుకొచ్చాడు. ఇద్దరూ ఫూటుగా మద్యం సేవించారు. ఆపై తన స్నేహితునితో పక్క పంచుకోవాలని భార్యను బలవంతం చేశారు. ఆమె నిరాకరించడంతో ఇద్దరూ కలిసి బలవంతంగా ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో మరో గదిలో నిద్రిస్తున్న తల్లి వాళ్లిద్దరిపై దాడి చేసింది. ఆపై వాళ్లిద్దరూ పారిపోయారు. అనంతరం తల్లి సాయంతో భర్త, అతడి స్నేహితుడు రవిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది.  
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. బాధితురాలి భర్త ఆమెకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని తేలింది. దీంతో అతనిపై మోసం, అత్యాచారయత్నం, వేధింపుల కేసులు నమోదు చేశారు. స్నేహితుడు రవితో పాటు అతనిని రిమాండ్‍‌కు తరలించారు.