శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2017 (19:47 IST)

మద్యం తాగితేనే ఆ సుఖం.. నగ్నంగా వీడియోలున్నాయ్.. యూట్యూబ్‌లో పెడతా..!

బెంగళూరులో ఓ సైకో భర్త భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పెళ్ళై.. హనీమూన్‌కు భార్యను వెంట తీసుకెళ్లిన ఆ సైకో భర్త అసలు స్వరూపం చూపించాడు. మద్యం సేవించి సెక్స్ సుఖం ఇవ్వాలని భార్యను ఒత్తిడి చేశాడు. అ

బెంగళూరులో ఓ సైకో భర్త భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పెళ్ళై.. హనీమూన్‌కు భార్యను వెంట తీసుకెళ్లిన ఆ సైకో భర్త అసలు స్వరూపం చూపించాడు. మద్యం సేవించి సెక్స్ సుఖం ఇవ్వాలని భార్యను ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో మెడపట్టి బయటికి నెట్టేశాడు. 

వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని విజయనగరకు చెందిన కృష్ణకుమార్, మైసూరుకు చెందిన ఓ అమ్మాయితో గత ఏడాది జూన్‌లో వైభవంగా వివాహం జరిగింది. ఈ దంపతులు హనీమూన్ కోసం మారిషన్ వెళ్లారు. కృష్ణకుమార్ హనీమూన్‌లోనే భార్యకు చుక్కలు చూపించాడు. భార్య తప్పతాగి పడక సుఖం ఇవ్వాలని పట్టుబట్టాడు. బాధిత మహిళ నిరాకరించడంతో ఆమెపై చేజేసుకున్నాడు. మద్యం సేవించకపోతే.. తాను సెక్స్‌లో పాల్గొనని.. హనీమూన్‌లో మొండికేసుకుని కూర్చున్నాడు. పెళ్ళైన కొత్తలో భర్త మాట కాదనలేక రంజిత మద్యం సేవించి భర్తతో శృంగారంలో పాల్గొంది. 
 
మారిషస్‌లో ఉన్నన్ని రోజులు రంజితకు పీకలదాక మందు తాగించి.. కోరిక తీర్చుకున్నాడు. బెంగళూరుకు వచ్చినా అదే తంతు సాగించి.. నిత్యం మద్యం సేవించి సెక్స్ సుఖం ఇవ్వాలని రంజితను వేధించడం మొదలెట్టాడు. మాజీ ప్రియురాలిని భార్యతో పోల్చుతూ నిత్యం వేధించేవాడు. ఓసారి ప్రతిరోజు మద్యం సేవించడానికి రంజిత నిరాకరించడంతో ఆమెను మెడపట్టి బయటికి గెంటేశాడు. 
 
ఈ ఘటనపై విజయనగర పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. మారిషస్‌ హనీమూన్‌లో, మత్తులో సెక్స్‌లో పాల్గొన్న సమయంలో తనను నగ్నంగా తన భర్త మొబైల్‌లో వీడియో తీశాడని.. చెప్పిన మాట వినకుంటే ఆ క్లిప్పింగ్స్ యూట్యూబ్‌లో పెడుతానని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.