బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (11:17 IST)

పెళ్లి భోజనాలు తిని 150 మంది ఆస్పత్రి పాలు

పెళ్లి భోజనాలు తిని 150 మంది ఆసుపత్రి పాలయ్యారు. కర్ణాటకలోని బెలగావి ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. హిరేకోడిలోని చెకోడి గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. 
 
బంధుమిత్రులతో పాటు గ్రామంలోని చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పెళ్లి వేడుకకు హాజరైన చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. 
 
భోజనం చేసిన 2 గంటల తర్వాత వీరందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో వీరందరినీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో తరలించారు. వంట పదార్థాలను, అలాగే వాటర్ ని కూడా పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు.