కార్పొరేట్లకు తాయిలాలు... ఉద్యోగులకు కోతలా?: ఆలిండియా బిఎస్ ఎన్ ఎల్ పింఛనుదారుల సంక్షేమ సంఘం
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, పింఛనుదారులకు డి.ఎ. నిలిపివేయడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ పేరుతో కార్పొరేట్లకు తాయిలాలు ప్రకటిస్తున్న కేంద్రం, సామాన్య ఉద్యోగులు, పింఛనుదారుల డి.ఎ.ని నిలిపివేయడం అన్యాయమని, ఆలిండియా బి.ఎస్.ఎన్.ఎల్. పెన్షనర్స్ వెల్పేర్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ కార్యదర్శి వి.వరప్రసాద్ విమర్శించారు.
ఈ ఏడాది అక్టోబరు నుంచి 2021 జూన్ వరకు రావాల్సిన డి.ఎ.ని రద్దు చేస్తూ, కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుబట్టారు. కోవిడ్ పేరిట కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ప్రకటిస్తున్న కేంద్రం, ప్రస్తుత కోవిడ్ క్లిష్ట సమయంలో సామాన్య ఉద్యోగులపై వివక్ష చూపడం దారుణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సి.పి.ఎస్. ఇ) 10 లక్షల మంది ఉద్యోగులకు, 2 లక్షల మంది బి.ఎస్.ఎన్.ఎల్, ఎం.టి.ఎన్.ఎల్ పింఛనుదారులకు దీని వల్ల నష్టం జరుగుతుందని వివరించారు.
కోవిడ్ వల్ల ఆరోగ్యం క్షీణించి... ఇప్పటికే నిత్యావసరాల ధరలు రిగి పింఛనుదారుల జీవనం దుర్భరంగా మారుతున్న తరుణంలో డి.ఎ. నిలుపుదల చేయడం సమంజసం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తపెర్వులను తీవ్రంగా నిరసిస్తున్నామని, వెంటనే సిపిఎస్ఇ. ఉద్యోగుల డి.ఎ. నిలుపుదల ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండు చేశారు.