వెస్ట్ బెంగాల్ : రూ.250 కోట్ల విలువైన పాము విషం స్వాధీనం
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు.
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అటవీశాఖ అధికారులు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు.
బెంగాల్‌లో పాము విషాన్ని అక్రమంగా అమ్మే అంతరాష్ట్ర ముఠా కోసం ఆ రాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. గతంలో పలువురిని అరెస్టు కూడా చేశారు. అయితే, తాజాగా భారీ మొత్తంలో పాము విషయాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది.
దీంతో నిఘా వేసిన అటవీశాఖ అధికారులు... జల్‌పాయిగురిలోని బెలకోబాలో ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అయిదు బాటిళ్లలో పాము విషాన్ని దుండగలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఒక్క గ్రాము విషానికి సుమారు రూ.26 వేల ధర పలుకుతుందని నిపుణులు అంటున్నారు. యాంటీ వీనమ్‌ను తయారు చేసేందుకు పాము విషాన్ని శాస్త్రవేత్తలు, డాక్టర్లు డిమాండ్ చేస్తుంటారని అటవీశాఖ అదికారులు భావిస్తున్నారు.