1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2023 (22:35 IST)

భార్యాభర్తల గొడవ.. చేతి వేలిని కొరికి ఉమ్మేశాడు..

couple
భార్యాభర్తల గొడవలు ప్రస్తుతం సర్వసాధారణమైపోయాయి. భార్యాభర్తల మధ్య గొడవలు హత్యలకు కూడా కారణం అవుతున్నాయి. క్షణికావేశం కొంపల్ని ముంచుతున్నాయి. తాజాగా భార్యతో గొడవపడిన భర్త.. ఆమె వేలిని కొరికి ఉమ్మేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. విజయ్ కుమార్ స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. అతని భార్య పేరు పుష్ప. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయి 23 ఏళ్లు కావస్తున్న వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారిద్దరూ అభిప్రాయ బేధాల కారణంగా విడిపోయి విడివిడిగా జీవిస్తున్నారు. విజయ్ కుమార్ తన కుమారుడితో కలిసి ఉంటున్నాడు. 
 
పుష్ప ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో జూలై 28న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో విజయ్ కుమార్ పుష్ప ఇంటికి వెళ్లాడు. అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి పెద్ద గొడవగా మారింది. ఆ సమయంలో విజయ్ ఆగ్రహంతో పుష్ప వేలిని కొరికి నమిలి ఉమ్మేశాడు. 
 
అలాగే పుష్పను చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనపై పోలీసులకు పుష్ప ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.