కుక్కల సతీశ్ ఇంట్లో ఈడీ సోదాలు... రూ.50 కోట్ల శునకం ఉత్తుత్తిదేనట
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రూ.50 కోట్ల విలువ చేసే రేర్ బ్రీడ్ వూల్ఫ్ డాగ్‌ను పెంచుకుంటున్నట్టు సోషల్ మీడియాలో సొంత ప్రచారం చేసుకున్న కుక్కల సతీశ్ ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో రూ.50 కోట్ల విలువ చేసే కుక్క లేదు తొక్కాలేదని ఈడీ అధికారులు తేల్చారు. పైగా, ఈ కుక్కల సతీశ్ అద్దె కుక్కలతో అనేకమందిని మోసం చేస్తున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా, సొంతం ప్రచారం చేసుకున్న ఆయన ఈడీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, పూల్ఫ్ డాగ్ జాతి కుక్కను రూ.50 కోట్లతో తాను కొనుగోలు చేసినట్టు బెంగుళూరుకు చెందిన సతీశ్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. దాంతో దీని వెనుక నగదు, అక్రమ చలామణి దందా నడుస్తున్నట్టు అనుమానించిన ఈడీ.. గురువారం ఆ వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించింది. అంత ఖరీదైన కుక్కను చూపించాలంటూ ఈడీ అధికారులు అతనికి నోటీసులు కూడా ఇచ్చారు.
దీంతో ఖంగుతిన్న కుక్కల సతీశ్... అది ఇపుడు తన వద్ద లేదని, స్నేహితుడు వద్ద విడిచిపెట్టానని సమాధానమిచ్చారు. అలాగే, తాను నగదు, అక్రమ చాలామణి దందా చేయట్లేదని, శునకాన్ని కూడా కొనుగోలు చేయలేదని సమాధానమిచ్చాడు. దాంతో ఈడీ అధికారులు మరిన్ని వివరాలను సేకరించేందుకు నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ రేర్ బ్రీడ్ వూల్ఫ్ డాగ్ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.