స్మార్ట్ ఫోన్ కోసం కన్నబిడ్డను తెగనమ్మాడు...
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరి చేతిలనూ ఈ ఫోన్ కనిపిస్తోంది. ఈ మోజు ఇపుడు గ్రామీణ ప్రాంతాలకూ పాకింది. దీంతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు కంటికి కనిపించిన వస్తువును తెగన
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. దీంతో ప్రతి ఒక్కరి చేతిలనూ ఈ ఫోన్ కనిపిస్తోంది. ఈ మోజు ఇపుడు గ్రామీణ ప్రాంతాలకూ పాకింది. దీంతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేందుకు కంటికి కనిపించిన వస్తువును తెగనమ్ముతున్నాడు. ఈ క్రమంలో ఓ తండ్రి... స్మార్ట్ ఫోన్ కోసం కన్నబిడ్డను తెగనమ్మాడు. ఓడిశా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
ఈ రాష్ట్రంలో భద్రక్ జిల్లాకు చెందిన బలరాం ముఖి స్వీపరుగా పనిచేస్తున్నాడు. బలరాంముఖి మొబైల్ ఫోన్ కొనేందుకు తన 11 నెలల కుమారుడిని రూ.23 వేలకు విక్రయించాడు. వచ్చిన డబ్బులో రెండు వేల రూపాయలతో ఓ మొబైల్ ఫోన్, తన ఏడేళ్ల కుమార్తెకు వెండి కడియం కొన్నాడు. మద్యానికి బానిసైనన బలరాం మిగిలిన డబ్బును మద్యం కొనేందుకు వినియోగించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.