గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (13:28 IST)

సల్మాన్ సరసన రీతు వర్మ.. బంపర్ ఆఫర్ కొట్టేసిందా?

పెళ్లిచూపులు ఫేమ్ రీతు వర్మ బాలీవుడ్‌లో నటించనుందని టాక్ వస్తోంది. కర్వాన్ అనే చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నాడు. ఇందులో రీతు వర్మను హీరోయిన్‌గా తీసుకునే ఛాన్సులున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల

పెళ్లిచూపులు ఫేమ్ రీతు వర్మ బాలీవుడ్‌లో నటించనుందని టాక్ వస్తోంది. కర్వాన్ అనే చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నాడు. ఇందులో రీతు వర్మను హీరోయిన్‌గా తీసుకునే ఛాన్సులున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
పెళ్లిచూపులు సినిమాకు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న రీతువర్మ... కోలీవుడ్‌లో విక్రమ్ సరసన మంచి ఆఫర్ కైవసం చేసుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో రీతూని తమిళ తెరకు పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అలాగే మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి వార‌సుడు, ఓకే బంగారం ఫేం దుల్కర్ స‌ల్మాన్ స‌ర‌స‌న రీతూ హీరోయిన్‌గా ఎంపికైందంటున్నారు. కొత్త దర్శకుడు పెరియసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లో బిజీగా వున్న దుల్కర్ సల్మాన్.. సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటిలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.