శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (12:28 IST)

కళాశాల విద్యార్థినిని రేప్ చేశాడు.. ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించిన బాయ్‌ఫ్రెండ్

బీహార్ కగారియా జిల్లాలో ఘోరం జరిగింది. ఓ కళాశాల విద్యార్థినిపై ఆమె బాయ్‌ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడటమే కాకుండా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదనుగా తీసుకున్న బాయ్‌ఫ్ర

బీహార్ కగారియా జిల్లాలో ఘోరం జరిగింది. ఓ కళాశాల విద్యార్థినిపై ఆమె బాయ్‌ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడటమే కాకుండా కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని అదనుగా తీసుకున్న బాయ్‌ఫ్రెండ్.. కళాశాల విద్యార్థిని ఆమె ఇంట్లోనే రేప్ చేశాడు. ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించి.. ఇంటికి తాళం వేసి పారిపోయాడు. బాధితురాలు కేకలు విన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
 
కానీ అంతలోనే జరగాల్సింది జరిగిపోయింది. బాధితురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తన వాంగ్మూలంలో థెంప్తా కరారి గ్రామంలోనే తన బాయ్‌ఫ్రెండ్ ఉంటున్నాడని, ఇద్దరం ఒకే కళాశాలలో చదువుకున్నామని చెప్పింది. అయితే ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడి, కిరోసిన్ పోసి నిప్పింటించాడని చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని వారి బంధువుల కోసం గాలిస్తున్నారు.