1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 26 మే 2023 (15:24 IST)

టీచర్, ప్రిన్సిపాల్ ఫైట్.. వీడియో వైరల్

Bihar
Bihar
టీచర్, ప్రిన్సిపాల్ ఫైట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీచర్, ప్రిన్సిపాల్ తలపడుతుంటే విద్యార్థులందరూ చుట్టూ చేరి చోద్యం చూశారు. మరికొందరు ఆ ఘటనను సెల్ ఫోన్‌లలో బంధించారు. 
 
తొలుత తరగతి గదిలో టీచర్, ప్రిన్సిపాల్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఆపై బయటికి వచ్చి.. ప్రిన్సిపాల్ కాంతి కుమారి, టీచర్ అనితా కుమారి ఫైట్ చేసుకున్నారు. 
 
వ్యక్తిగత వైరంతోనే వారు కొట్టుకున్నట్టు తెలుస్తోంది.వారిద్దరూ కిందపడి దొర్లుతూ కొట్టుకుంటుంటే మూడో మహిళ జోక్యం చేసుకుని చెప్పుతో మరో మహిళను కొట్టడం వీడియోలో కనిపిస్తోంది.
 
వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ గొడవపడి కొట్టుకున్నట్టు విద్యాశాఖ అధికారి చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.