శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (17:01 IST)

పాఠశాలలో అమ్మాయిల అశ్లీల నృత్యాలు... మండిపడుతున్న నెటిజన్లు

school girls dance
విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పాఠశాలలో కొందరు యువతులు హద్దూఅదుపు లేకుండా ప్రవర్తించారు. పాఠాలు చెప్పే స్కూలులో ఏకంగా అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలను వెలుగులోకి రావడంతో వారి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బీహార్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బీహార్ రాష్ట్రంలోని నవాదా జిల్లా డెగమా ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇందులో తాజాగా ఓ కార్యక్రమం జరిగింది. ఇద్దరు యువతులు ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా స్టెప్పులు వేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో కొందరు షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు నేర్పించాల్సిన విద్య ఇదేనా అంటూ ఉపాధ్యాయుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, టీచర్లను, ఉపాధ్యాయులను తిట్టిపోస్తున్నారు.