శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (11:18 IST)

ఇన్‌స్టా క్వీన్ అని పేరు.. తొమ్మిదేళ్ల బాలిక ఆత్మహత్య

తమిళనాడులో దారుణం జరిగింది. తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో తండ్రి చదువుకోమని చెప్పినందుకు తీవ్ర ఆగ్రహానికి గురైన తొమ్మిదేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండే బాలికను చుట్టుపక్కల వారు ఇన్‌స్టా క్వీన్ అని పిలుస్తుంటారు. 
 
సోమవారం బాలిక అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా.. తండ్రి ఆటలు ఆపి చదువుకోమని చెప్పాడు. ఇంటి తాళాలు కూడా ఇచ్చి పంపాడు. ఆ  తరువాత ఆయన తన బైక్ తీసుకుని పెట్రోల్ నింపుకునేందుకు వెళ్లారు. రాత్రి 8.15 గంటలకు ఇంటికి వెళ్లిన ఆయన..తలుపులు కొట్టగా బాలిక ఎంతకీ స్పందించలేదు. 
 
దీంతో కంగారు పడిపోయిన కృష్ణమూర్తి తలుపులు పగలగొట్టి లోపలికెళ్లగా.. బాలిక ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.