బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

బీహార్‌ : భోజనం లేటుగా పెట్టిందని భార్యను పొడిచి చంపేశాడు..

ఇటీవలికాలంలో మహిళలపై జరిగుతున్న నేరాలు, ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళలను చిత్రహింసలు పెట్టేందుకు, హత్య చేసేందుకు పెద్ద కారణాలు కూడా అవసరం లేకుండా పోతున్నాయి. గుండు సూది కింద పడినా కూడా మృగా

ఇటీవలికాలంలో మహిళలపై జరిగుతున్న నేరాలు, ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళలను చిత్రహింసలు పెట్టేందుకు, హత్య చేసేందుకు పెద్ద కారణాలు కూడా అవసరం లేకుండా పోతున్నాయి. గుండు సూది కింద పడినా కూడా మృగాళ్లు రచ్చిపోతున్నారు. భోజనం లేటుగా పెట్టిందన్న కోపంతో భార్యను పొడిచి చంపాడో భర్త. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన శివమంగళ్‌ రామ్‌ అనే వ్యక్తికి భార్య దుర్గాదేవి ఉంది. భోజన సమయానికి ఇంటికి వచ్చిన రామ్.. భార్యను పిలిచి అన్నం పెట్టాలని కోరాడు. ఆ సమయంలో దుర్గాదేవి ఫోనులో మాట్లాడుతూ ఉన్నది. దీంతో భర్తకు అన్నం పెట్టడంలో కాస్త ఆలస్యం జరిగింది. 
 
అంతే... రామ్‌కు కోపం కట్టలు తెంచుకుంది. నేరుగా వంటిట్లోకి వెళ్లి కత్తిని తీసుకుని భార్యను పొడిచి చంపేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.