శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:45 IST)

హై ఫీవర్‌తో పరీక్షలకు వెళ్లిన విద్యార్థి మృతి..

హై ఫీవర్‌తో బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. విద్యా సంవత్సరం వృథా కారాదన్న ఆలోచనతో హై ఫీవర్‌తో బోర్డు పరీక్షలకు బీహార్ షరీఫ్‌లోని ఆదర్శ్ హైస్కూల్ విద్యార్థి రోహిత్ కుమార్ పరీక్షలకు హాజరయ్యాడు. తొలుత అతడి అనారోగ్య కారణాల వల్ల సంబంధిత పరీక్షా కేంద్రంలోని స్కూల్ యాజమాన్యం అనుమతి నిరాకరించినా.. సంవత్సరం వేస్ట్ అవుతుందన్న భయంతో పరీక్ష రాస్తానని పట్టుబట్టాడు. 
 
దీంతో పరీక్ష నిర్వాహకులు ఒకవైపు జిల్లా పరీక్షల కంట్రోల్ రూమ్‌తోనూ, అతడి తల్లిదండ్రులతోనూ సంప్రదించారు. చివరకు రోహిత్ కుమార్ తల్లి వచ్చి తన కొడుకును పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరింది.
 
అయితే, పరీక్ష రాస్తుండగా అతడి ఆరోగ్యం మరింత దిగజారింది. దీంతో రోహిత్ కుమార్‌ను చికిత్స కోసం దవాఖానకు తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. ఆస్తమా వల్లే రోహిత్ మరణించాడని ఆమె తల్లికి తర్వాత వివరించారు. బీఎస్ఈబీ బోర్డు పరీక్షల్లో భాగంగా శుక్రవారం సోషల్ సైన్స్ పరీక్ష ఫస్ట్ షిప్ట్‌లో జరిగింది. కానీ ప్రశ్నపత్రం లీకైందని వార్తలొచ్చాయి. దీంతో ఈ పరీక్ష రద్దు చేశారు. వచ్చే నెల 8వ తేదీన తిరిగి సోషల్ సైన్స్ పరీక్ష నిర్వహిస్తారు