సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (10:31 IST)

మహిళా కౌన్సిలర్‌ను కన్నుకొట్టిన మేయర్ కుమారుడు...

బీహార్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. మహిళా కౌన్సిలర్‌ను మేయర్ కుమారుడు కన్నుకొట్టాడు. పదేపదే నవ్వుతూ కన్నుగీటాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళా కౌన్సిలర్.. ఈ విషయాన్ని ఏకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల పాట్నా మునిసిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో మహిళా వార్డు కౌన్సిల్ సభ్యురాలు పింకీదేవి హాజరయ్యారు.  
 
ఈ సమావేశానికి మేయర్ తన కుమారుడు శిషీర్‌ను తీసుకుని వచ్చింది. అతను ఓ వైపు కూర్చొని.. పింకీదేవిని చూసి నవ్వుతూ కన్నుగీటాడు. అయినా, ఆమె పట్టించుకోకపోవడంతో పదేపదే అదే పనిచేశాడు. దీంతో ఈ విషయాన్ని ఆమె మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. 
 
అయినా ఫలితం లేకపోవడంతో ఆమె నేరుగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. విషయం వెలుగులోకి రావడంతో మేయర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా కౌన్సిలర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన శిషీర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.