శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 31 మే 2016 (15:27 IST)

మహిళ మృతదేహాన్ని బైకుపై తరలించారు.. ఎందుకని... ఎక్కడ?

మనిషి బతికున్నప్పుడు గౌరవించని మనుషులు చనిపోయాక మృతదేహం పట్ల మర్యాద పాటిస్తారు. దహనసంస్కారాలు చేసేవరకు మృత‌దేహాన్ని సంప్ర‌దాయానుబద్దంగా ఒక చోటి నుంచి మ‌రోచోటుకి త‌ర‌లించ‌డం భార‌తీయ ఆచారం. అలాంటిది ఇద్దరు యువకులు చనిపోయిన మహిళ మృతదేహాన్నిఆటబొమ్మలా బైక్‌పై తీసుకొని వెళ్లడం కలకలం రేపింది. ఈ దారుణ ఘటన ఒడిశా రాజ‌ధాని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది. 
 
దీని పూర్తి వివరాలను.. పరిశీలిస్తే భారాముండా గ్రామంలో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి ఉన్న ఆ మృతదేహాన్నిఇద్దరు యువకులు బైక్  వెనకాల కట్టుకుని తీసుకెళుతున్న వైనం అందరిని భ్రమింపజేశాయి. మృతదేహాన్ని తరలించేందుకు, వాహనం అందుబాటులో లేక ఇలా చేశారా... లేక ఇతర కారణాలేమన్నా ఉన్నాయాని అనుమానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. 
 
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ రష్మిత్ పాండా... ఆ చుట్టుపక్కల 20 కి.మీ పరిధిలో రెండు వాహనాలు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. మృతదేహాలను తరలించేందుకు పేదల కోసం వీటిని అందుబాటులో ఉంచామని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనే బరంగపూర్ జిల్లాలో జరిగింది.