గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (13:06 IST)

బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. మమతా బెనర్జీ ఓ నపుంసకురాలంటూ ఎద్దేవా

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ స్త్రీనా లేక పురుషుడా అంటూ బీజేపీ రాష్ట్ర ప్యానెల్ సభ్యుడు శ్యామపాద మండల్ చేసిన తీవ్ర సంచలన వ్యాఖ్యలు పెను కలకలం రేపు

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ స్త్రీనా లేక పురుషుడా అంటూ బీజేపీ రాష్ట్ర ప్యానెల్ సభ్యుడు శ్యామపాద మండల్ చేసిన తీవ్ర సంచలన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. 
 
వెస్ట్ మిడ్నాపూర్‌లో జరిగిన బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, మమతా బెనర్జీ నపుంసకురాలు అని ఎద్దేవా చేశారు. ముస్లింలు వారి మత సంప్రదాయల్లో భాగంగా ఎలా చేస్తారో అలాంటి పనులే మమత చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
మమతా బెనర్జీ అసలు స్త్రీనా? లేక పురుషుడా? అన్న విషయం తమకు అర్థం కావడం లేదని ఆయన సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆమె ఒక హిజ్రా అని తాను చెప్పగలనని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.