బెంగళూరు బీజేపీ నేత కళ్లల్లో కారం కొట్టారు.. వేటకొడవళ్లతో నరికి చంపేశారు...
బెంగళూరులో బీజేపీ నేతను నడిరోడ్డులోని అతికిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపేశారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎస్సీ-ఎస్టీ విభాగం ఉపాధ్యక్షుడు హరీష్ (40)
బెంగళూరులో బీజేపీ నేతను నడిరోడ్డులోని అతికిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపేశారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బీజేపీ ఎస్సీ-ఎస్టీ విభాగం ఉపాధ్యక్షుడు హరీష్ (40) ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైనాడు. బెంగళూరు గ్రామీణ జిల్లాలో హరీష్ బీజేపీ కార్యకలాపాల్లో చురుగ్గా వుండే ఇతనని హతమార్చాలని శత్రువులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా సూర్యా సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో హరీష్ బైక్‌లో వెళ్తుండగా.. ప్రత్యర్థులు దాడికి ఒడిగట్టారు. రామసాగర గేట్ వద్ద హరీష్ బైకును అడ్డగించి.. వెంటనే హరీష్ కళ్లల్లో కాలం చల్లారు. దీంతో కుప్పకూలిన అతనిని.. వేటకోడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. రాజేష్ అలియాస్ రాజు, సంతోష్ గ్యాంగ్ హరీష్‌ను హత్య చేశారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.