గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (19:38 IST)

ఇంటి పనిమనిషితో మూత్రం తాపించిన బీజేపీ మహిళా నేత సీమా పాత్ర

maid tortures
భారతీయ జనతా పార్టీకి చెందిన నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న సీమా పాత్ర తన ఇంట్లో పని చేసే పనిమనిషికి నరకం చూపించింది. ఆమెను ఓ గదిలో బంధించి పస్తులతో మాడ్చింది. ఇంటిని ఆ యువతి నాలుకతో శుభ్రం చేయించింది. అక్కడితో ఆగకుండా నేలపై మూత్రం పోసి ఆ యువతితో తాగించిది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. దీన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సుమతి (29) అనే యువతి పదేళ్ల క్రితం సీమా పాత్ర ఇంట్లో పాచి పని చేసేందుకు కుదిరింది. సీమ వాళ్ల కుమార్తె ఢిల్లీ ఉంటే ఉంటే ఆమెకు తోడుగా ఈ యువతిని కూడా పంపిచారు. నాలుగేళ్ళ క్రితం తిరిగి వచ్చిన తర్వాత సుమతికి సీమా పాత్ర నకరం చూపించింది. సుమతి అక్క, బావలకు ఆమె పరిస్థితి తెలిసినా కూడా ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి ఆసక్తి చూపించలేదు. 
 
అయితే, సీమా పాత్ర కుమారుడు ఆయుష్మాన్ మాత్రం ఆ యువతి పడుతున్న బాధలను చూసి చలించిపోయాడు. తన ఇంట్లో సుమతి పడుతున్న బాధలను తన స్నేహితుడికి చెప్పి సాయం చేయాలని కోరాడు. అతను పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో పోలీసులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు సీమా పాత్ర ఇంటిలో ఆకస్మికంగా సోదాలు చేసి సుమతిని రక్షించారు. ఆ యువతిని ఆస్పత్రి చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుని తాను ఎదుర్కొన్న వేధింపులను పూసగుచ్చినట్టు వివరించింది. 
 
తనకు ఆహారం ఇచ్చేవారు కాదని, బలవంతంగా మూత్రం తాగించేవారని సుమతి చెప్పింది. ఐరన్ రాడ్డు, బెల్టులతో చావబాదేదని, హాట్ ప్యాన్‌తో వాతలు పెట్టేదని వాపోయింది. పళ్లు ఊడిపోయేలా కొట్టేదని కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ నాయకులకు అధికారంతో కళ్లు నెత్తికెక్కాయని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.