దినకరన్ విజయం తథ్యం : బీజేపీ ఎంపీ డాక్టర్ స్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో జరిగిన ఆర్కే. నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం తరపున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ విజయం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వ
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణంతో జరిగిన ఆర్కే. నగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం తరపున స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ విజయం తథ్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి జోస్యం చెప్పారు. ఈ స్థానానికి ఈనెల 21వ తేదీన జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి దినకరన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
దీనిపై సుబ్రమణ్యస్వామి స్పందిస్తూ, ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం తథ్యమని, ముఖ్యంగా, ఈ ఫలితాన్ని ముందే ఊహించినదేనని ఆయన చెప్పారు. "జయలలిత మరణానంతరం జరుగుతున్న ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో దినకరన్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా 2019 లోక్‌సభ ఎన్నికల కోసం అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఒక్కటవుతాయని ఆశిస్తున్నా..." అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.