గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 డిశెంబరు 2018 (13:30 IST)

జార్ఖండ్ రాష్ట్రంలో బహిరంగ ముద్దుల పోటీకి బీజేపీ మోకాలడ్డు

జార్ఖండ్ రాష్ట్రంలో బహిరంగ ముద్దుల పోటీకి భారతీయ జనతా పార్టీ అడ్డుచెప్పింది. నిజానికి ప్రతి యేడాది ఈ తరహా పోటీలను ఆ రాష్ట్రంలో ఉన్న ఓ గిరిజన తెగ ప్రజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా, పాకూర్ జిల్లాలోని సిద్దో కన్హు గ్రామ ప్రజలు దీన్ని ఓ ఆచారంగా భావిస్తున్నారు. ముద్దు ద్వారా తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తం చేయడమే ఈ పోటీల ప్రత్యేకత. 
 
ఈ పోటీలను జార్ఖండ్‌ ముక్తి మోర్చాకు చెందిన స్థానిక ఎమ్మెల్యే సీయో మారండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత 2017లో నిర్వహించగా, మొత్తం 18 జంటలు పోటీ పడ్డాయి. ఆ వీడియోలు అపుడువైరల్‌గా మారాయి. అప్పటివరకూ వెలుగులోకిరాని ఈ వింత ఆచారం ప్రపంచానికి తెలిసి, పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సంవత్సరం పండుగ జరుపుకునేందుకు అనుమతించేది లేదని బీజేపీ స్పష్టంచేసింది. 
 
బహిరంగ ముద్దులు భారత సంప్రదాయం కాదని, అది చెడు సందేశాలు ఇస్తోందన్నది బీజేపీ నేతలు వాదిస్తున్నారు. అందువల్ల ఈ యేడాది ఈ తరహా పండగ జిల్లా ఎస్‌డీఓ జితేంద్ర కుమార్‌ అదేశాలు జారీచేయగా, గిరిజనులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముద్దుల పోటీ తమ ఆచారంలో భాగమని, స్వచ్ఛంగా ప్రేమను వ్యక్త పరుచుకోవడం కోసమేనని ఎమ్మెల్యే అంటున్నారు.