భార్యపై ఇద్దరితో కలిసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన మాజీ భర్త

rape girl
Last Updated: శుక్రవారం, 9 నవంబరు 2018 (11:16 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై మరో ఇద్దరితో కలిసి ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, అతి దారుణంగా హింసించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

జార్ఖండ్ రాష్ట్రంలోని జంతర జిల్లాలోని నారాయణ పూరా పోలీస్‌ స్టేషన్‌లో పరిధికి చెందిన స్థానిక సమీపంలో కాళీపూజా థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లింది. దీన్ని గమనించిన ఆమె మాజీ భర్త పథకం పన్నాడు. సినిమా నుంచి తిరిగి వస్తున్న సమయంలో మరో ఇద్దరితో కలిసి ఆమెను కిడ్నాప్ చేశాడు. అక్కడ నుంచి ఊరిచివర ఉన్న పొలాల్లోకి తీసుకునిపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ దుర్మార్గులు అంతటితో ఆగలేదు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించారు. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోవడంతో వారంతా పారిపోయారు. మరునాడు ఉదయం నిస్సహాయ స్థితిలో రోదిస్తున్న ఆమెను గమనించిన స్తానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ బాధితురాలి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం జంతర సదర్‌ హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. దీనిపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాజీ భర్తతో పాటు మరో ఇద్దరు కామాంధులను అదుపులోకి తీసుకున్నారు.దీనిపై మరింత చదవండి :