ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (12:39 IST)

"విశ్వాసం" సెట్‌లో గుండెపోటుతో మరణించిన డాన్సర్... అజిత్ భారీ సాయం

తమిళ హీరో అజిత్. 'వీరం', 'వేదాళం', 'వివేగం' వంటి హ్యాట్రిక్ సూపర్ హిట్ చిత్రాలతో మంచి స్పీడ్‌లో ఉన్నారు. ఈయన తాజా చిత్రం విశ్వాసం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ షూటింగ్‌ ప్రస్తుతం పుణెలో జరుగుతోంది. ఓ పాటను చిత్రీకరిస్తుండగా విషాదం చోటుచేసుకుంది. 
 
విశ్వాసంకు సంబంధించిన పాటను షూట్‌ చేస్తుండగా.. డ్యాన్సర్‌ ఓవియన్‌ శరవణన్‌ హఠాత్తుగా మరణించాడు. గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయిన అతన్ని చిత్రయూనిట్‌ ఆసుపత్రికి తరలించింది. 
 
కానీ అప్పటికే ఆయన మృతి చెందాడు. అజిత్‌ తన సొంత ఖర్చులతో మృతదేహాన్ని విమానంలో చెన్నైకి చేరేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయన కుటుంబానికి తన వంతుగా రూ.8 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి తనలోని పెద్ద మనసును మరోమారు చాటుకున్నాడు అజిత్.