బీఎంసీ ఎన్నికల్లో శివసేనదే హవా.. రెండో స్థానంలో బీజేపీ..
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన పార్టీనే గెలుపును నమోదు చేసుకుంది. కడపటి సమాచారం అందే సమయానికి 88 సీట్లు సాధించిన శివసేన గెలుపు బావుటా ఎగురవేసింది.
ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేన పార్టీనే గెలుపును నమోదు చేసుకుంది. కడపటి సమాచారం అందే సమయానికి 88 సీట్లు సాధించిన శివసేన గెలుపు బావుటా ఎగురవేసింది. తద్వారా బీజేపీ, శివసేనల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో శివసేనదే పైచేయిగా నిలిచింది. తద్వారా దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేలా అత్యధిక సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
బీఎంసీ ఎన్నికల కోసం శివసేన తెగతెంపులు చేసుకున్న తర్వాత తన చిరకాల మిత్రపార్టీ బీజేపీ సైతం అంతే స్థాయిలో దూసుకొచ్చింది. తద్వారా రెండో స్థానంలో నిలిచింది. 54 స్థానాల్లో గెలుపును నమోదు చేసుకుంది. ఇక మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు మాత్రం ఈ సారి ముంబైలో చావుదెబ్బ తగిలింది. గత 20 ఏళ్లలో లేనంతగా ఓటమిని చవిచూసింది. కేవలం 19 స్థానాలు గెలుచుకుంది.